పెట్రోల్‌పై రూ. 6 కరోనా పన్ను.. త్వరలో అన్ని రాష్ట్రాల్లోనూ!
కరోనా వైరస్ ను అరికట్టడానికి ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెల్సిందే. లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం భారీగా తగ్గింది. దీంతో ఆదాయాన్ని పెంచుకోవడానికి పెట్రోల్ పై అదనపు పన్ను విధించాలని ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. ఇప్పటికే అసోం ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను రూ.5 వరకు పెంచింది.
తాజాగా నాగాలాండ్ ప్రభుత్వం లీటర్ పెట్రోల్, మోటార్ స్పిరిట్‌పై రూ.6, లీటర్ డీజిల్‌పై రూ. 5 చొప్పున సెస్ విధించింది. ఈ మేరకు అదనపు చీఫ్ సెక్రటరీ అండ్ ఫైనాన్స్ కమిషనర్ సెట్టియాంగెర్ ఇంచెన్ ఓ నోటిఫికేషన్ వెలువరించింది. నాగాలాండ్ ట్యాక్సేషన్ యాక్ట్ 1967 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పెరిగిన ధరలు ఏప్రిల్ 28 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. ఆదాయం పెంచుకోవడానికి మిగతా రాష్ట్రాలు ఇంధనంపై అదనపు విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.