రాష్ట్రానికి రాకపోతే రూ. 10 వేలు ఇస్తాం.. - MicTv.in - Telugu News
mictv telugu

రాష్ట్రానికి రాకపోతే రూ. 10 వేలు ఇస్తాం..

May 14, 2020

hvnfg

లాక్ డౌన్ కారణంగా పరాయి రాష్ట్రాల్లో ఉంటున్న వలస కూలీలు పెద్ద సంఖ్యలో స్వరాష్ట్రాలకు వెళ్తున్నారు. సరైన రవాణా సౌకర్యాలు లేనప్పటికీ కొందరు కాలినడకన వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎందరో కూలీలు అనారోగ్యానికి గురవుతున్నారు. కొందరు వలస కూలీలు పట్టణాల్లో ఉన్న కరోనా వైరస్ ను పల్లెల్లోకి తీసుకుని వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నాగాలాండ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇతర రాష్ట్రాల్లో చిక్కుపోయిన వారు కరోనా మహమ్మారి తగ్గేంత వరకు రాష్ట్రంలోకి రాకుండా ఉండడానికి ఒక్కొక్కరికి రూ. 10 వేలు చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలను వారి సొంత రాష్ట్రాలకు చేర్చేందుకు రైళ్లు నడపాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో నాగాలాండ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 18 వేల మందికిపైగా కార్మికులు స్వరాష్ట్రానికి వచ్చేందుకు ప్రభుత్వ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్నట్టు నాగాలాండ్ చీఫ్ సెక్రటరీ టెంజెన్ టోయ్ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న నాగాలాండ్ ప్రజలు ఇబ్బందులు పడకుండా అక్కడే ఉండేదుకు ప్రతి ఒక్కరికీ రూ. 10 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఆయన వివరించారు.