కాంగ్రెస్ గూటికి నాగం, గద్దర్ కుమారుడు - MicTv.in - Telugu News
mictv telugu

కాంగ్రెస్ గూటికి నాగం, గద్దర్ కుమారుడు

April 25, 2018

తెలంగాణలో రేవంత్ రెడ్డితో మొదలైన పార్టీ ఫిరాయింపులు ఊపందుకుంటున్నాయి. బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఆయన పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. రాహుల్ స్వయంగా కండువా కప్పి ఆహ్వానించారు.

నాగంతోపాటు ప్రజా గాయకుడు గద్దర్‌ కుమారుడు సూర్య మరికొందరు కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఇతర రాష్ట్ర నేతలు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. నాగం జనార్దన్‌రెడ్డి ఇటీవల బీజేపీకి రాజీనామా చేయడం తెలిసిందే. రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరడంతో టీడీపీ, బీజేపీ ఇతర పార్టీల్లోని చిన్నాచితకా నాయకులు కాంగ్రెస్, టీఆర్ఎస్‌లలోకి వెళ్లిపోతున్నారు.