నాగరాజు హత్య.. ఆ పాస్ట్‌వర్డ్ పెట్టుకోవడం వల్లే మొబిన్‌కు దొరికిపోయాడు - MicTv.in - Telugu News
mictv telugu

నాగరాజు హత్య.. ఆ పాస్ట్‌వర్డ్ పెట్టుకోవడం వల్లే మొబిన్‌కు దొరికిపోయాడు

May 17, 2022

సోషల్ మీడియా మరియు ఇతర అకౌంట్లకు సంబంధించిన లాగిన్ డీటైల్స్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పాస్‌వర్డ్ అనేది చాలా స్ట్రాంగ్‌ అండ్ సెక్యూర్‌గా ఉండాలి. ఇటీవల హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ పీఎస్ పరిధిలో జరిగిన నాగరాజు హత్యకి మూలం అతని జీమెయిల్ పాస్‌వర్డ్. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. తన చెల్లి ఆశ్రిన్ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని మొబిన్, అతడి బావ కలిసి నాగరాజును హత్య చేసిన సంగతి తెలిసిందే. హత్యకు ముందు నాగరాజు ఆచూకీ కోసం మొబిన్ వాడిన టెక్నాలజీ గురించి తెలిస్తే షాక్ అవ్వక తప్పదు.

తన జీమెయిల్‌కు పాస్‌వర్డ్‌గా మొబైల్‌ నంబర్‌ను పెట్టుకున్న మొబిన్… నాగరాజు జీమెయిల్ ఐడీ పాస్‌వర్డ్‌ కూడా మొబైల్‌ నంబరే ఉండొచ్చని ట్రై చేశాడు. నాగరాజు జీమెయిల్‌ను లాగిన్ చేసి పాస్‌వర్డ్‌గా అతడి మొబైల్‌ నంబర్‌ టైప్ చేసి సక్సెస్ అయ్యాడు. ఇక అతడు ఎక్కడున్నాడో తెలసుకునేందుకు మొబైల్‌ చోరీకి గురైన సమయాల్లో ఉపయోగించే ‘ఫైండ్ మై డివైస్’ ఆప్షన్‌ను వాడాడు. ఆ ఆప్షన్‌తోనే నాగరాజు ఎక్కడున్నాడో గుర్తించి.. పక్కా ప్లాన్ ప్రకారం తన బంధువైన అహ్మద్‌తో కలిసి హత్య చేశాడు. ఇద్దరు నిందితుల కస్టడీ ముగియడంతో వారిని ఎల్బీ నగర్ కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఇద్దరు నిందితులను చర్లపల్లి జైలుకు తరలించారు.