కరోనా టైమ్స్..గర్భిణిని ఆదుకున్న ఎమ్మెల్యే రోజా - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా టైమ్స్..గర్భిణిని ఆదుకున్న ఎమ్మెల్యే రోజా

March 24, 2020

roja

కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. దీంతో ఎన్నో రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ప్రకటించారు. దీంతో దేశమంతా స్తంభించిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా లాక్‌డౌన్ విజయవంతంగా కొనసాగుతోంది. బయట ఎలాంటి వాహనాలు తిరగడంలేదు. ఇలాంటి కష్ట కాలంలో గర్భిణీ మహిళను హాస్పిటల్‌కి పంపించాడానికి తన కారును పంపించి వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా మరోసారి పెద్దమనసు చాటుకున్నారు. రోజా నియోజకవర్గం నగరిలోని పుదుపేటకు చెందిన సరస్వతి అనే మహిళ నిండు గర్భిణి. ఆమె వైద్య పరీక్షల కోసం నగరి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడి నుంచి తిరుపతి మెటర్నిటీ ఆస్పత్రికి వెళ్లేందుకు కుటుంబ సభ్యులతో కలిసి 108 వాహనంలో బయల్దేరారు. 

నగరి ప్రభుత్వ ఆసుపత్రి నందు 108 వాహనం సరిగా పనిచేయని కారణంగా ప్రసవము కు వచ్చిన నగరి పుదుపేట నుంచి సరస్వతి మహిళను తన సొంత వాహనంలో తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్ కు పంపించిన ఎమ్మెల్యే ఆర్కే రోజా గారు

Publiée par Roja Selvamani sur Lundi 23 mars 2020

కానీ, కొంత దూరం వెళ్లిన తరువాత సరస్వతి ప్రయాణిస్తున్న 108 వాహనం ఆగిపోయింది. రాష్ట్రం మొత్తం లాక్‌డౌన్‌లో ఉండడంతో ప్రైవేట్ వాహనాలు కూడా అందుబాటులో లేవు. దీంతో వాళ్లకు ఏం చేయాలో తోచలేదు. ఈ విషయం ఎమ్మెల్యే రోజాకు తెలియడంతో తన కారును సరస్వతిని తరలించడానికి ఇచ్చారు. రోజా సహాయం చేయడంతో సరస్వతిని తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్‌కు పంపించారు. సరైన సమయానికి తన కారును పంపించి పెద్ద మనసు చాటుకున్న ఎమ్మెల్యే రోజాకు మహిళ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.