బిగ్‌బాస్ ప్రొమో : సీపీఐ నారాయణకు గట్టి కౌంటర్ ఇచ్చిన నాగార్జున
బిగ్ బాస్ సీజన్‌పై సీపీఐ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అదో బ్రోతల్ హౌస్ అని, వంద రోజుల తర్వాత ఏమీ కాకుండా పవిత్రంగా బయటికి వస్తారంటే తాను నమ్మనని కామెంట్ చేశారు. లోపల చాలా అసాంఘిక కార్యక్రమాలు జరగుతున్నాయని, అంతేకాక, నాగార్జున ఫ్యామిలీపూ పర్సనల్ అటాక్ చేశారు. ఇప్పుడు బిగ్‌బాస్ సీజన్ 6 మొదలైంది. ఇందుకు సంబంధించిన ఫస్ట్ ప్రోమో రిలీజయింది.
ఇందులో నాగార్జున సీపీఐ నారాయణకు గట్టి కౌంటర్ ఇచ్చారు. హౌస్‌లోకి వెళ్లిన మొత్తం 21 మంది కంటెస్టెంట్లలో మెరీనా - రోహిత్‌లు నిజజీవితంలో భార్యాభర్తలు. అయితే హౌస్‌లోకి వెళ్లిన తర్వాత వీరిద్దరి మధ్య పంచాయితీలు మొదలయ్యాయి. తన భర్త రోహిత్ తనను పట్టించుకోవడం లేదని, కనీసం హగ్, ముద్దు వంటివి కూడా పెట్టకుండా దూరం పెడుతున్నాడని మెరీనా నాగార్జునకు ఫిర్యాదు చేసింది. ఆమె బాధను అర్ధం చేసుకున్న నాగార్జున రోహిత్‌ను పిలిచి ఆమెకు గట్టి హగ్ ఇవ్వమంటాడు. అతను అలాగే చేయడంతో ‘నారాయణ నారాయణ వాళ్లిద్దరూ మ్యారీడ్’ అని చెప్తాడు. ఇందులో నారాయణ, నారాయణ అని చెప్పడానికి సీపీఐ నారాయణనే కారణమని ప్రేక్షకులకు అర్ధమైపోతుంది. అంటే బిగ్‌బాస్‌ను తీవ్రంగా రెడ్ లైట్ ఏరియాతో పోల్చిన నారాయణకు నాగార్జున ఈ విధంగా కౌంటరిచ్చాడని భావిస్తున్నారు. మరి నారాయణ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.