కేబీఆర్ పార్క్, అన్నపూర్ణ స్టూడియో.. నమ్మండి..! - MicTv.in - Telugu News
mictv telugu

కేబీఆర్ పార్క్, అన్నపూర్ణ స్టూడియో.. నమ్మండి..!

March 14, 2018

ఫోటోలు గతించిన వైభవాన్ని ఆవిష్కృతం చేస్తాయనటానికి అక్కినేని నాగార్జున  ‘బ్లాస్ట్ ఫ్రమ్ ది పాస్ట్’ అంటూ షేర్ చేసిన ఈ ఫోటో చెబుతోంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చాలామందిని ఆలోచింపజేస్తున్న ఈ ఫోటోలో వున్నది తెలుగు లెజెండరీ హీరోలు అక్కినేని నాగేశ్వర్రావు, ఎన్టీ. రామరావులు. హైదరాబాద్, బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ వెళ్లే మార్గంలో ఎప్పుడో తీసిన ఓ చిత్రంలోనిదీ దృశ్యం.  ‘ఇద్దరు లెజెండ్స్ ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్… ఎడమవైపు కనిపిస్తోంది కేబీఆర్ పార్కు గోడ.

 

కుడివైపు వున్నది అన్నపూర్ణా స్టూడియోస్. ఈ రోడ్డుగుండా వెళితే జూబ్సీహిల్స్ చెక్‌పోస్టు వస్తుంది. అయితే అప్పుడున్నంత ప్రశాంతత మాత్రం ఇప్పుడుండదు ’ అని వ్యాఖ్యానించారు. ఏఎన్ఆర్ కారును డ్రైవ్ చేస్తుంటే, ఎన్టీఆర్ ఆయన పక్కన కూర్చుని వస్తున్నారు.. కాగా, ఈ చిత్రం ఇద్దరు మహానటులు నటించిన ‘రామకృష్ణులు’ చిత్రం షూటింగ్ సమయంలో తీసినది. నిజమే అప్పుడు ఇంత ట్రాఫిక్ లేదు, ఇన్ని బంగ్లాలు లేవు. ప్రశాంతంగా వుండేది. ఇప్పుడంతా మారిపోయింది.. ఇంకా ముందు ముందు ఈ మహానగరంలో ఎన్నెన్ని పరిణామాలు సంభవించనున్నాయోనని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు.