ఆ నలుగురిపై సస్పెన్షన్ ఎత్తివేసిన నాగార్జున వర్సిటీ  - MicTv.in - Telugu News
mictv telugu

ఆ నలుగురిపై సస్పెన్షన్ ఎత్తివేసిన నాగార్జున వర్సిటీ 

February 3, 2020

anu.

జై అమరావతి అంటూ నినాదాలు చేశారని నలుగు విద్యార్థులపై విధించిన సస్పెన్షన్‌ను నాగార్జున యూనివర్సిటీ ఎత్తివేసింది. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని తాము ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను వర్సిటీ అధికారులు సోమవారం విడుదల చేశారు. 

స్టూడెంట్స్ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం అమరావతికి మద్దతుగా చేపట్టిన ఆందోళనలో నలుగురు విద్యార్థులు పాల్గొన్నారు. దీంట్లో జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. దీంతో నలుగురిని క్రమశిక్షణ చర్యలో భాగంగా హాస్టల్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు వెల్లడించారు. దీనిపై విపక్ష టీడీపీతో పాటు విద్యార్థి సంఘాలు అభ్యంతరం తెలిపాయి. వీసీ అన్యాయం సస్పెండ్ చేశారని విద్యార్థులు ఆరోపించారు. దీంతో ఈ విషయం వివాదం కావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అయితే అధికారులు మాత్రం రాజకీయ ర్యాలీలో విద్యార్థులు ఎలా పాల్గొంటారని ప్రశ్నిస్తున్నారు.