Nagarjuna's break from movies..Clarity on election slogans
mictv telugu

సినిమాలకు నాగార్జున బ్రేక్..ఎన్నికల్లో పోటిపై క్లారిటీ

September 30, 2022

Nagarjuna's break from movies..Clarity on election slogans

దక్షిణాది సినీ ప్రియులకు అక్కినేని కుటుంబం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అక్కినేని నాగేశ్వర రావు మొదలుకొని యంగ్ హీరో అఖిల్ వరకు అగ్రహీరోలుగా కొనసాగుతున్నారు. తాజాగా కింగ్ నాగార్జున అక్కినేని అభిమానులకు ఓ బిగ్ షాక్ ఇచ్చాడు. ‘ది ఘోస్ట్’ చిత్రం విడుదలైన తర్వాత ఆరు నెలలపాటు విశ్రాంతి తీసుకుంటానని ప్రకటించాడు.

తాజాగా నాగార్జున ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన మాట్లాడుతూ..”కొవిడ్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రేక్షకుల అభిరుచుల్లో చాలా మార్పులు వచ్చినట్లు గ్రహించా. ప్రజలు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నా. అందుకోసం కనీసం ఆరు నెలల సమయం అవసరం. ఈ ఏడాది ‘ది ఘోస్ట్’ తర్వాత నా సినిమాలేవీ ఉండట్లేదు. తర్వాత ఓటీటీలోనూ నటించాలనే ప్రణాళికతో ఉన్నా. అందుకే స్క్రిప్ట్ విన్నాక అది ఓటీటీకి సరిపోతుందా, థియేటర్లో రిలీజ్ చేయాలా అన్న విషయంపై నిర్ణయం తీసుకోవాలి. అందుకే విరామం తీసుకోవాలనుకుంటున్నా’ అని అన్నారు.

మరోపక్క నాగార్జున త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నారని జరుగుతున్న ప్రచారంపై కూడా క్లారిటి ఇచ్చాడు. ‘ నాకు రాజకీయాల్లోకి వ‌చ్చే ఆలోచ‌నే లేదు. విజ‌య‌వాడ ఎంపీగా పోటీ చేయ‌డం లేదు. ఎన్నిక‌లు వ‌చ్చిన ప్ర‌తిసారి ఇలాగే నాపై ప్ర‌చారం చేస్తున్నారు’ అని ఆయ‌న అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

ఇక, ‘ది ఘోస్ట్’ చిత్రం విషయానికొస్తే..అక్టోబర్ 5న ఈ సినిమా థియేటర్లలో విడుదలకానుంది. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించారు. అయితే, ఇప్పటికే సోషల్ మీడియ వేదికగా ఈ సినిమాకు సంబంధించిన పాటలు, ట్రైలర్ విడుదలై, ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో నాగార్జున ఈ చిత్రం తర్వాత 6 నెలల సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించడంతో హాట్ టాపిక్‌గా మారింది.