Nagarjuna's recent comments on Naga Chaitanya and Samantha's divorce
mictv telugu

నాగచైతన్య, సమంత విడాకులపై నాగార్జున రీసెంట్ కామెంట్స్

September 15, 2022

సమంత నాగచైతన్య విడాకులు వారి కుటుంబాలనే కాదు.. అభిమానులకు సైతం పెద్ద షాక్ ఇచ్చాయి. చూడముచ్చటైన ఈ జంట విడాకులు తీసుకోవడం ఎవరికీ జీర్ణం కాలేదు. ఇప్పటికీ వారి విడాకులకి సంబంధించిన వార్త ఏదైనా నెట్టింట్లో వైరలవుతూనే ఉంది. కొన్ని రోజుల క్రితం సమంత తండ్రి జోసెఫ్ ప్రభు.. కుమార్తె విడాకులపై స్పందించారు. “త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని, ఇద్దరి నిర్ణయం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది ‘ అంటూ సోషల్ మీడియాలో సామ్ చైల వివాహ చిత్రాలను కొన్నింటిని పంచుకున్నారు. చైతన్య-సమంతలు విడిపోయినా తమ జీవితాల్లో మాత్రం ఇద్దరు ముందుకు సాగాలని..ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలి అన్న సంకేతాలు ఆయన పంపారు.

తాజాగా ప్రముఖ హీరో, నాగచైతన్య తండ్రి నాగార్జున వారి విడాకుల గురించి ప్రస్తావించారు. బ్ర‌హ్మాస్త్ర సినిమా స‌క్సెస్ సంద‌ర్భంగా నాగార్జున ముంబై వెళ్లిన‌ప్పుడు అక్క‌డి మీడియా చైతు, సామ్ విడాకుల గురించి ప్ర‌శ్నించింది. నాగ చైత‌న్య సినిమాల కంటే అత‌ని వ్య‌క్తిగ‌త జీవితంపై చర్చ జ‌ర‌గ‌టం అనేది తండ్రిగా మిమ్మ‌ల్ని ఆందోళ‌న‌కు గురి చేస్తోందా! అని అడిగిన ప్ర‌శ్న‌కు నాగ్.. ‘త‌ను (నాగ చైత‌న్య‌) హ్యాపీగా ఉన్నాడు. నేను దాన్ని చూస్తున్నాను. నాకు అది చాలు. ఇప్పుడు మేం విడాకుల విష‌యం గురించి ఆలోచించ‌టం లేదు. త‌మ జీవితాల నుంచి అది వెళ్లిపోయింది. అలాగే అంద‌రి జీవితాల్లో నుంచి వెళ్లిపోతుంద‌ని ఆశిస్తున్నాం’ అన్నారు. ఇక విడాకుల విషయం పక్కన పెడితే.. ప్ర‌స్తుతం ఇటు నాగ చైత‌న్య‌, అటు స‌మంత వారి వారి సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా మారిపోయారు.