Nagashaurya Padayatra for movie promotion
mictv telugu

టాలీవుడ్‌లో కొత్త శకం.. సినిమా ప్రమోషన్ కోసం నాగశౌర్య పాదయాత్ర

September 13, 2022

Nagashaurya Padayatra for movie promotion

పాదయాత్ర అంటే సాధారణంగా రాజకీయ నాయకులు చేయడం చూశాం. కానీ సినిమా చరిత్రలోనే తొలిసారిగా సినిమా ప్రమోషన్ కోసం పాదయాత్ర చేయనున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఈ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

తన తాజా చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’ కోసం ఏపీలోని పలు నగరాల్లో పాదయాత్ర చేసి అభిమానులను కలుసుకోనున్నారు. ఇందుకు తగ్గ రోడ్‌మ్యాప్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ నెల 14న తిరుపతిలో పాదయాత్ర ప్రారంభం కానుండగా, 15న నెల్లూరు, 16న విజయవాడ – గుంటూరు – ఏలూరు, 17న రాజమండ్రి – భీమవరం, 18న కాకినాడ – వైజాగ్‌లో చిత్ర బృందం పాదయాత్ర చేయనుంది. అనీష్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో షెర్లీ సెతియా హీరోయిన్‌గా నటిస్తోంది. ప్యూర్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఛలో సినిమా తర్వాత సరైన హిట్ లేని నాగశౌర్య.. ఈ చిత్రంతో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు.

Nagashaurya Padayatra for movie promotion