ప్రేక్షకులకు లేని బాధ.. మీడియా,మహిళా సంఘాలకెందుకు? - MicTv.in - Telugu News
mictv telugu

ప్రేక్షకులకు లేని బాధ.. మీడియా,మహిళా సంఘాలకెందుకు?

November 25, 2017

ఈ జబర్దస్త్ షోలో హైపర్ ఆది అనాథ పిల్లలపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఈ షోను నిషేధించాలని, జడ్జీల స్థానం నుంచి నాగేంద్రబాబు, రోజాలు వెంటనే తప్పుకోవాలని అనాథ పిల్లలు, మహిళా సంఘాలు, ప్రజల సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.

ఈ వ్యవహారంపై నాగబాబు స్పందించడానికి నిరాకరించారు. ‘ఈ షోపై వస్తున్న విమర్శలకు నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. కామెడీనా? బూతులా అని నిర్ణయించాల్సింది మహిళా సంఘాలు, మేధావులు కారు.. ప్రేక్షకులే అంతిమ నిర్ణేతలు.. ’ అని ఆయన అన్నారు. దీనిపై ఇకపై తనను అడగొద్దని  టీవీ 9 చానల్‌తో అన్నారు. ఈ వివాదంపై రోజా ఇంతవరకు స్పందించలేదు.

నాగబాబు వ్యాఖ్యలపై సామాజిక కార్యకర్త సజయ ఘాటుగా స్పందించారు. ‘నేను కూడా ప్రేక్షకురాలినే. నాగబాబూ జవాబు వింటే ఆయనపై జాలి కలుగుతోంది…’ అని అన్నారు.