నాగు పాముతో నాగిని డ్యాన్స్.. చివరికి ఐదుగురు - MicTv.in - Telugu News
mictv telugu

నాగు పాముతో నాగిని డ్యాన్స్.. చివరికి ఐదుగురు

April 30, 2022

దేశవ్యాప్తంగా గతకొన్ని రోజులుగా వందల సంఖ్యలో పెళ్లిళు జరుగుతోన్నాయి. పెళ్లి అంటే 16 రోజుల వేడుక. ఈ వేడుకలో ప్రధానమైన ఘట్టాలు చాలానే ఉంటాయి. పెళ్లి చూపులు మొదలుకొని, పెళ్లి పూర్తి అయ్యేవరకు బంధువులతో, స్నేహితులతో వరుడి, వరుణి ఇండ్లు పండగ వాతావరణంతో కన్పిస్తాయి. ఇక, పెళ్లిల్లో ప్రధాన ఘట్టమైన ఊరేగింపు (బారాత్)లో డీజే, బ్యాండ్ వంటి వాయిద్యాలతో వరుడిని, వధువును డ్యాన్సులు వేస్తూ, సాగానంపుతారు.

ఒడిశా రాష్ట్రం మయూర్ భంజ్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో నిజమైన నాగాపాముతో ఓ వ్యక్తి నాగిని డ్యాన్స్ వేసి కటకటాల పాలైన సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో.. పాములు పట్టే ఓ వ్యక్తి బుట్టలో నాగుపామును పెట్టుకొని, నాగిని డ్యాన్స్ చేస్తున్నాడు. అక్కడున్న స్థానికులు ఫోన్లో వీడియోను రికార్డ్ చేస్తూ, ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఎవరో పోస్ట్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పామును ఆడించిన వ్యక్తితో పాటు పెళ్లి పెద్దలను ఐదుగురిని అరెస్ట్ చేశారు. పాములను జనంలోకి తీసుకురావటం చట్టరీత్యా నేరంకావడంతో అటవీశాఖ అధికారులకు పామును అప్పంగించారు.