మాస్క్ ధరించకపోతే జరిమానా పెంచిన ప్రభుత్వం.. ఎంతంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

మాస్క్ ధరించకపోతే జరిమానా పెంచిన ప్రభుత్వం.. ఎంతంటే..

September 13, 2020

Nagpur mask violation fine up from Rs 200 to Rs 500: Minister

కొందరి నిర్లక్ష్యంతో కరోనా మరింత వ్యాప్తి చెందుతోందని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు వేగంగా ప్రబలుతున్నా మాస్క్‌ ధరించకుండా తిరుగుతున్నారని అన్నారు. కనీస జాగ్రత్త చర్యలు పాటించక నిర్లక్ష్యంతో వైరస్‌ను కొనితెస్తున్నారని తెలిపారు. ముఖానికి మాస్క్‌ తప్పనిసరి చేసినా.. మాస్క్ ధరించని వారికి నాగపూర్‌ నగరంలో రూ.200 జరిమానా విధిస్తున్నా ఎవరూ వినడంలేదు. అందుకే ఇప్పుడు మాస్క్ ధరించకపోతే సోమవారం నుంచి రూ.500లకు పెంచుతున్నామని అన్నారు. కరోనా వ్యాక్సిన్‌ వచ్చే వరకన్నా కాస్త జాగ్రత్త చర్యలు పాటించాలని కోరుతున్నట్టు చెప్పారు. 

భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను అనుసరించాలని అన్నారు. కాగా, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 97,654 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 47,51,788కి పెరిగింది. మరణాల సంఖ్య 78,614కు పెరిగింది. ఒక్క మహారాష్ట్రలోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షల మార్కును దాటింది.