సోషల్ డిస్టెన్స్ అంటే ఇది..పోలీసోళ్ళ క్రియేటివిటీ - MicTv.in - Telugu News
mictv telugu

సోషల్ డిస్టెన్స్ అంటే ఇది..పోలీసోళ్ళ క్రియేటివిటీ

April 7, 2020

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలందరూ సోషల్ డిస్టెన్స్ ను పాటించాలని ప్రభుత్వాలు, వైద్యులు విజ్ఞప్తి చేస్తున్న సంగతి తెల్సిందే. అయినా కూడా కొందరు సోషల్ డిస్టెన్స్ ను పాటించడం లేదు. 

దీంతో రోజు రోజుకీ కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సోషల్ డిస్టెన్స్ గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. కొందరు పోలీసులు సోషల్ డిస్టెన్స్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి క్రియేటివిటిని వాడుతున్నారు. ఇటీవల నాగ్ పుర్ పోలీసులు చేసిన ట్వీట్ ఇందుకు చక్కటి ఉదాహరణ. బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్, దీపికా పదుకొనె నటించిన ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ సినిమాలోని సీన్లతో సోషల్ డిస్టెన్స్ పై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో ఓ బెంచీపై దీపిక పడుకొనె ఈ చివరన కూర్చుకుంటే షారూక్ ఆ చివరన కూర్చుంటాడు. సోషల్ డిస్టెన్స్ అంటే ఇదేనని, చేయి తాకనంత దూరంలో ఉండాలంటూ నాగ్ పూర్ పోలీసులు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.