18 మంది సర్పంచులకు కలెక్టర్ నోటీసులు జారీ.. ఎందుకంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

18 మంది సర్పంచులకు కలెక్టర్ నోటీసులు జారీ.. ఎందుకంటే..

June 30, 2020

Collector

నాగర్ కర్నూలు జిల్లాలో గ్రామాల అభివృద్ధి పనుల్లో అలసత్వంపై జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు 18 గ్రామాల సర్పంచులకు జిల్లా కలెక్టర్  షోకాజ్ నోటీసులు జారీచేశారు. గ్రామాల్లో స్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు చెత్తతో నిండిపోతుండటం, ఎరువు తయారీ కేంద్రాల నిర్మాణాల్లో 18 గ్రామ పంచాయతీల సర్పంచులు అలసత్వం ప్రదర్శించారని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష ఈ నిర్ణయం తీసుకున్నారు. కోడేరు మండలంలో తుర్కదిన్నె, ఎర్రన్నబావి తాండ, తీగలపల్లి, నాగులపల్లి తాండ, ఉప్పునుంతల మండలంలో ఉప్పునుంతల, వెల్టూర్, అయ్యవారిపల్లి, 

పెద్ద కొత్తపల్లి మండలంలో వెన్నచర్ల, చంద్రకల్, నారాయణపల్లి, జొన్నల బొగుడ, తెలకపల్లి మండలంలో పార్వతి పూర్, తాండూర్ మండలంలో తుమ్మల సుగుర్, వంగూర్ మండలంలో చౌదర్ పల్లి, లింగాల మండలంలో రాంపూర్, మర్రికుంట తండా, పెంట్లవెల్లి మండలంలో సింగవరం, కొల్లాపూర్ మండలంలో కుడికిల్ల తదితర గ్రామాల సర్పంచులకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నారని మంగళవారం సాయంత్రం ఈ నోటీసులు జారీ చేశారు.