మనిషి చచ్చిపోయిన కూడా గోర్లు, వెంట్రుకలు పెరుగుతాయి: సైన్స్ - MicTv.in - Telugu News
mictv telugu

మనిషి చచ్చిపోయిన కూడా గోర్లు, వెంట్రుకలు పెరుగుతాయి: సైన్స్

June 17, 2022

ఈ విషయం మీకూ తెలుసో లేదో తెలీదు కానీ సైన్స్ మాత్రం.. మనిషి చచ్చిపోయిన కూడా గోర్లు, వెంట్రుకలు పెరుగుతాయని చెప్తోంది. అంతేకాదట మృతదేహం నుంచి శబ్దాలు కూడా వస్తాయని పేర్కొంది. ”మరణం తర్వాత శరీరంలోని కొన్ని కణాలు ఇంకా బ్రతికే ఉంటాయి. అవి శరీరంలోని ఆక్సిజన్‌ని ఉపయోగించుకొని పెరుగుతాయి. అలా గోర్లు, జుట్టు కూడా పెరుగతాయి. ఈ ప్రక్రియ కేవలం కొద్దిసేపు మాత్రమే జరుగుతుంది. శరీరంలో గ్లూకోజ్ శాతం పూర్తిగా పడిపోయేంతవరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత జుట్టుతో పాటు గోర్లు పెరగడం ఆగిపోతాయి. మృతదేహం నుంచి శబ్దాలు కూడా వస్తాయి. అది పోస్ట్‌మార్టం సమయంలోనే.. చనిపోయాక మృతదేహంలో ఒక రకమైన గ్యాస్ ఉత్పన్నం అవుతుంది. దీని వల్ల కళ్లు, నాలుక బయటకు వస్తాయి. పోస్టమార్టం చేస్తున్నప్పుడు శరీరంలో ఉండే ఆ గ్యాస్ స్వరపేటికపై ఒత్తిడి కలగజేయడంతో వివిధ రకాల శబ్దాలు బయటకొస్తాయి.” అని వైద్యులు ఓ నివేదికను విడుదల చేశారు.

సామాన్యంగా మనిషి ఏదైనా కారణం చేత మరణిస్తే..మొదటగా గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. తర్వాత శరీరంలో రక్త ప్రసరణ నిలిచిపోతుంది. దాంతో రక్తం చల్లబడటం స్టార్ట్ అవుతుంది. శరీరం కూడా గట్టిగా అయిపోతుంది. దాంతో బాడీలో ఎలాంటి కదలిక ఉండదు. అలాంటప్పుడు గోర్లు, వెంట్రుకలు ఎలా పెరుగుతాయి? అనే సందేహం మీకూ రావొచ్చు. కానీ, మీరు నమ్మినా, నమ్మకపోయినా, ఇది మాత్రం సత్యమని సైన్స్ చేప్తున్నట్లు వైద్యశాస్త్ర నిపుణులు వివరాలను వెల్లడించారు.