Naina Jaishwal filed a complaint against a person harassing her online
mictv telugu

నైనా జైశ్వాల్‌కు వేధింపులు.. అసభ్య మెసేజులపై ఫిర్యాదు

August 12, 2022

Naina Jaishwal filed a complaint against a person harassing her online

సోషల్ మీడియా వాడకం పెరిగే కొద్దీ ప్రముఖులకు ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. కొందరు ఆకతాయిలు వారి అకౌంట్లకు అసభ్యకర మెసేజులు పంపించి రాక్షసానందం పొందుతారు. తాజాగా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైశ్వాల్‌కి ఓ పోకిరీ వెధవ అసభ్యకర మెసేజులు పంపి వేధిస్తున్నాడు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతకు అభ్యంతర మెసేజులు రావడంతో జైశ్వాల్ హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించింది. వేధిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది.

దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆకతాయిని పట్టుకునే పనిలో పడ్డారు. గతంలో జైశ్వాల్ అకౌంట్ హ్యాకింగ్‌కి గురవగా ఇలాగే పోలీసులకు ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించుకుంది. కాగా, హైదరాబాదుకు చెందిన జైశ్వాల్‌ మల్టీ టాలెంట్ ఉన్న వ్యక్తి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో క్రీడల్లో రాణిస్తూ దేశానికి ఎంతో మంచి పేరు తెచ్చింది.