రంగారెడ్డి జిల్లా కొత్తగూడెం బ్రిడ్జి వద్ద మంగళవారం రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. చెట్ల మధ్య కుళ్లిన స్థితిలో ఉన్న శవాలను చూసి ఆ ప్రాంతంలో కలకలం రేగింది. మృతులను వారాసిగూడకు చెందిన యశ్వంత్ (22), జ్యోతి (28)గా పోలీసులు గుర్తించారు. జ్యోతికి ఇద్దరు పిల్లలు, భర్త ఉన్నారు. హత్య జరిగిన తీరును బట్టి వివాహేతర సంబంధమే హత్యలకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృత దేహాలతో పాటు ఓ బైకు, బ్యాగు ఘటనా స్థలిలో దొరికాయి. మృతదేహాలను పరిశీలించిన పోలీసులు షాక్కు గురయ్యారు. యువకుడి మర్మాంగాన్ని ఛిద్రం చేసి, యువతి ముఖాన్ని రాయితో చితక్కొట్టి దారుణంగా హత్య చేశారు.
యశ్వంత్ కారు డ్రైవరుగా పని చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. హంతకులను త్వరలో పట్టుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ ఘటనపై డీసీపీ మాట్లాడుతూ, జ్యోతి భర్తను విచారిస్తున్నామని తెలిపారు. యశ్వంత్ సోదరుడు మాట్లాడతూ.. ఆదివారం సాయంత్రం తన సోదరుడు బైకు పై బయటికి వెళ్లాడని, బైకు నెంబర్ ఆధారంగా పోలీసులు తనకు ఫోన్ చేసి విషయం చెప్పారని వెల్లడించారు.