రుచిలోనూ, ఆరోగ్యంలోనూ మన దేశ వంటలకు మరేవీ సాటి రావు. విదేశాల్లో కూడా మన వంటలు చాలా ఫేమస్. కొంచెం కారంగా , మరికొంచెం ఘాటుగా ఉండే స్పైసీ ఫుడ్‌ని ఇష్టపడి లాగించేస్తారు విదేశీయులు. మరీ ముఖ్యంగా నిత్యం ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా మనం తినే ఇడ్లీ, దోశలు పలు దేశాల్లో మంచి స్నాక్ అండ్ హెల్తీ ఐటమ్ గా మారిపోయింది. అయితే అంతలా పేరు తెచ్చుకున్న మన ఇడ్లీ, దోశలను మరో పేరుతో అమెరికాలో అమ్ముతున్నారు. అది కూడా మన భారతీయ రెస్టారెంటే. విదేశీయులకు పరిచయమున్న కొత్త పేర్లతో భారతీయ వంటకాలను సర్వ్ చేస్తోంది. ఆ మెనూ తాలూకు స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అక్కడున్న భారతీయులకు ఇది నచ్చడం లేదు. తాము లొట్టలేసుకుంటూ తినే ఆహారానికి పేర్లు మార్చడం మన వాళ్లకు అస్సలు మింగుడు పడలేదు. ఇదేం చోద్యం.. అంటూ మండిపడుతున్నారు.
అయితే.. విదేశీయులకు ఇవేంటో తెలియదు కాబట్టి.. వారికి తెలిసిన పదాలతో భారతీయ వంటకాలకు కొత్త పేర్లు పెట్టి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. ఇంతలా ఆ రెస్టారెంట్‌ను వెనకేసుకొచ్చిన వారు కూడా పేరు మార్పు విషయంలో అంగీకరించలేక తటపటాయిస్తున్నారు. ఇక దేశీయ వంటకాలకు కొత్త పేర్లు పెట్టిన మరో రెస్టారెంట్‌లోని మెనూను కూడా ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. సాంబార్ ఇడ్లీని డంక్డ్ రైస్ కేక్ డిలైట్ అని, సాంబార్ వడని డంక్డ్ డోనట్ డిలైట్ అని అంటున్నారు. ఇక దోశల పేర్లు అయితే చెప్పక్కర్లేదు.. నోరు కూడా తిరగలేనంతగా ప్లెయిన్ దోశకు నేకెడ్ క్రెప్ అని మసాలా దోశని స్మాష్డ్ పొటాటో క్రెప్ అని , రైస్ కేక్ అని ఇలా ఏవేవో పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారు. ప్రస్తుతం దీనిపై నెట్టింట్లో రచ్చ జరుగుతోంది.
omfg pic.twitter.com/EEIkpBJcoA
— inika⛓ (@inika__) July 16, 2022