దేశాధ్యక్షుడి వీడియో కాన్ఫరెన్స్‌లో నగ్నంగా.. - MicTv.in - Telugu News
mictv telugu

దేశాధ్యక్షుడి వీడియో కాన్ఫరెన్స్‌లో నగ్నంగా..

May 18, 2020

Zoom

లాక్‌డౌన్ కారణంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇలా నుంచే పనిచేస్తున్నారు. ఇళ్ల నుంచే చదువుకుంటున్నారు. ఇళ్ల నుంచే వీడియో కాన్ఫరెన్స్ లో మీటింగ్ లకు అటెండ్ అవుతున్నారు. అయితే, ఈ వీడియోల్లో అప్పడప్పుడు అపరిచితులు ప్రత్యక్షమవుతున్నారు. నగ్నంగా కనిపిస్తు షాకిస్తున్నారు.

తాజాగా బ్రెజిల్ కు చెందిన సావో పాలో ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు పాలో స్కాఫ్ జూమ్‌లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఆ దేశ అధ్యక్షుడు జైర్ బాసినరో‌ కూడా పాల్గొన్నారు. ఆయనతోపాటు మరో 10 మంది ఈ మీటింగులో ఉన్నారు. అయితే, వారిలో ఒక వ్యక్తి నగ్నంగా స్నానం చేస్తూ కనిపించాడు. దీంతో బాసినరో‌ షాకయ్యారు. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోండని ఆదేశించారు. అలాగే అతడిని కాన్ఫరెన్స్ నుంచి తొలగించారు. దీనిపై పరిశ్రమల శాఖ మంత్రి పాలో గ్యూడెస్ మాట్లాడుతూ..”ఆ వీడియోలో ఓ వ్యక్తి నగ్నంగా స్నానం చేస్తున్నాడు. మీటింగ్ వేడి వేడిగా జరుగుతుండటంతో అతడు చన్నీటి స్నానం చేస్తున్నాడు.” అని  చమత్కరించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ స్నానం చేసిన వ్యక్తి వాణిజ్యవేత్త అని తెలిసింది. అతను మీటింగులో వీడియోను ఆపడం మరిచిపోయి ఉంటాడని అధికారులు అంటున్నారు.