రేపిస్టులను నడిబజార్లో ఊరేగించి, ఉతికి ఆరేసి.. - MicTv.in - Telugu News
mictv telugu

రేపిస్టులను నడిబజార్లో ఊరేగించి, ఉతికి ఆరేసి..

March 26, 2018

చట్టాలు, కోర్టులు పనిచేయని చోట ప్రజలే ముందుకొస్తారు. అమ్మాయిలను కాటేసే మదాంధులకు వారే బుద్ధిచెబుతారు. జనానికి పోలీసులు కూడా తోడైతే.. ఈ వీడియోలో చూపినట్లు ఉన్నట్టుంది. ఒక యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిని నలుగురు మృగాళ్లను భోపాల్ పోలీసులు నడిబజారులో ఊరేగించారు. మహిళలతో చెంపదెబ్బలు కొట్టాంచారు. ఆగ్రహం తట్టుకోలేని కొందరు చెప్పులు, కర్రలతో కామాంధులను చితకబాదారు. వారితో గుంజీలు కూడా తీయించారు.

కొందరు తీవ్రంగా కొట్టడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ రేపిస్టులను ఇలా కాకుండా అర్ధనగ్నంగా ఊరేగించాల్సిందని ప్రజలు అంటున్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే ఏదో తూతూ మంత్రం విచారణలా కాకుండా దుండగులను బజారుకు ఈడిస్తే మిగతా నేరస్తులు భయపడతారే తామీ నిర్ణయం తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా బాధితులకు ధైర్యం వస్తుదని అన్నారు.  ఈ నలుగురిపై నిర్భయ కేసు పెట్టామని, కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.

ఈ నలుగురు శనివారం 20 ఏళ్ల విద్యార్థిపై అఘాయిత్యానికి తెగబడ్డారు. కాలేజీలో చదువుతున్న శైలేంద్ర దాంగీ అనే యువకుడు తన జూనియర్ అయిన విద్యార్థిని సెల్ ఫోన్ లాక్కున్నాడు. తన స్నేహితుడి గదికి వస్తే ఫోన్ ఇస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. అమె అక్కడికెళ్లగా అత్యాచారానికి పాల్పడ్డారు.