నల్గొండ సీఐ ఎక్కడున్నాడో తెలిసింది! - MicTv.in - Telugu News
mictv telugu

నల్గొండ సీఐ ఎక్కడున్నాడో తెలిసింది!

February 3, 2018

నల్గొండ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకట రెడ్డి అనుచరుడు బొడ్డుపల్లి శ్రీనివాస్  వారం రోజుల క్రితం హత్య చేయబడ్డ విషయం తెలిసిందే. అంతేకాద  ఆ తర్వాత జరిగిన మరో హత్యలో   పాలకుర్తి మధు అనే వ్యక్తిని కూడా హత్య చేసి ఆయన తలను జెండా గద్దెపై పడేసిన విషయమూ విదితమే. ఈ రెండు హత్యలను విచారణ అధికారిగా నల్గొండ టూటౌన్ పోలీస్ స్టేషన్  సీఐ వెంకటేశ్వర్లు ఉన్నారు.  మొన్న శుక్రవారం సీఐ  ఒక్కసారిగా కనిపించకపోవడంతో  రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టించింది.ఎట్టకేలకు సీఐ వెంకటేశ్వర్లు ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. అతను గుంటూరు జిల్లా బాపట్లలోని ఓ రిసార్టులో ఉన్నట్లు తెలిసింది.  నల్గొండలో వరుసగా రెండు హత్యలు జరగడంతో ఆ కేసులపై ఉన్నతాధికారులు  సీఐ వెంకటేశ్వర్లను మందలించినట్లు తెలుస్తుంది. అందుకే మానసిక ప్రశాంతత కోసం బాపట్లలోని రిసార్ట్ కు వెళ్లినట్లు  సీఐ  స్పష్టం చేశాడు.

శుక్రవారం నాడు సీఐ వెంకటేశ్వర్లు  తన సర్వీస్ రివాల్వర్‌ను తన డ్రైవర్ కు అప్పగించి, మొబైల్ లోని సిమ్ కార్డును కూడా పోలీస్ స్టేషన్లో ఇచ్చి ఎవ్వరికీ చెప్పకుండా మాయపోయారు. దీనితో సీఐ అదృశ్యంపై ఆరా తీసిన పై అధికారులకు  సీఐ బాపట్లలో ఉన్నట్లు తెలిసింది.  సీఐ ఆచూకీ లభించడంతో ఇటు పోలీస్ శాఖ అటు సీఐ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.