ఇది అవినీతి రహిత తహసీల్దార్ ఆఫీసు! - MicTv.in - Telugu News
mictv telugu

ఇది అవినీతి రహిత తహసీల్దార్ ఆఫీసు!

April 15, 2019

ప్రభుత్వ శాఖల్లో అవినీతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెవిన్యూ, పోలీసు వంటి విభాగాలంటే అవినీతికి అడ్డాలు అని జనం భావిస్తుంటారు. డబ్బులిస్తేగాని పనులు చేయరని తిట్టుకుంటుంటారు అయితే తాము అలాంటి వాళ్లం కాదని నల్గొండ జిల్లా మునుగోడు తహసీల్దార్ కార్యాలయం పోస్టర్ వేసి ప్రదర్శిస్తోంది.

Nalgonda district Munugodu mro tahsildar office pasted poster claims it is uncorrupted in the wake of revenue department abolition news.

తమను అందరూ అవినీతిపరులని తిడుతున్నారని, కానీ తాము ఎవరివద్దా డబ్బులు తీసుకోవడం లేదని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. తమపై దురభిప్రాయం కలగకుండా ‘ఇది అవినీతి రహిత కార్యాలయం’ అని చెప్పుకుంటూ పోస్టర్లను ప్రదర్శిస్తున్నారు. జనం రెవిన్యూ సేవలకు డబ్బులు ఇవ్వొద్దని, దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిష్కరిస్తామని అందులో రాశారు. ఎవరైనా డబ్బులు అడిగితే అధికారులకు ఫిర్యాదు చేయొచ్చంటూ వారి ఫోన్ నంబర్లను కూడా ఇచ్చారు. రెవిన్యూ శాఖను సీఎం కేసీఆర్ రద్దు చేస్తున్నారని వార్తల నేపథ్యంలో ఈ పోస్టర్ అంటించడం విశేషం.