విశాఖలో నల్గొండ డ్రైవర్ సజీవ దహనం...  - MicTv.in - Telugu News
mictv telugu

విశాఖలో నల్గొండ డ్రైవర్ సజీవ దహనం… 

September 21, 2020

Nalgonda driver burnt alive in Visakhapatnam ...

విశాఖ జిల్లాలోని గాజువాకలో ఈరోజు ఉదయం ఓ వ్యక్తి నడిరోడ్డుపై మంటల్లో కాలి బూడిదయ్యాడు. దీంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. నడిరోడ్డుపై పెట్రోల్‌ అంటుకుని ఓ వ్యక్తి మంటల్లో కాలిబూడిద అవడాన్ని పక్కనే ఉన్న ఓ దుకాణ యజమాని చూశాడు. వెంటనే  పోలీసులకు సమాచారం అందించాడు. అయితే పోలీసులు వచ్చేలోపే వ్యక్తి మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతను ఆత్మహత్య చేసుకున్నాడా? లేకపోతే ఎవరైనా పెట్రోల్ పోసి నిప్పు అంటించారా? అన్న కోణంలో విచారణ వేగవంతం చేశారు. 

విచారణలో మృతుడు నల్గొండ జిల్లాకు చెందిన నరసింహారావుగా పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న నరసింహారావు లోడ్ తీసుకుని రెండు రోజుల క్రితం గాజువాకకు వచ్చాడు. కారణాలేంటో తెలీదు.. ఈ ఉదయం మంటలు అంటుకుని రోడ్డుపైనే మంటలకు ఆహుతి అయ్యాడని పోలీసులు తెలిపారు. లారీలో అతనితో పాటు ఇంకెవరైనా వచ్చారా? అని పోలీసులు విచారణ జరుపుతున్నారు. సంఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.