Nalgonda Fluorosis Fighter Amshala Swamy Passes Away
mictv telugu

Amshala Swamy : ఫ్లోరైడ్‌ వ్యతిరేక ఉద్యమకారుడు అంశాల స్వామి మృతి..

January 28, 2023

Amshala Swamy who had fought a long battle against fluoride in Nalgonda

ఫ్లోరైడ్‌ సమస్యపై అవిశ్రాంతంగా పోరాడిన ఫ్లోరోసిస్ బాధితుడైన అంశాల స్వామి మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి పడి చనిపోయారు. అంశాల స్వామి మృతిపట్ల మంత్రి కేటీఆర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

నల్లగొండ జిల్లా శివన్నగూడెం గ్రామానికి చెందిన 32 ఏండ్ల స్వామి చిన్నతనంలోనే ఫ్లోరోసిస్ బారినపడ్డారు. ఫ్లోరైడ్ రక్కసిని తరమికొట్టాలని అవిశ్రాంతంగా పోరాడారు. ఫ్లోరైడ్ బాధితుల తరపున గళం వినిపించారు. కాగా, శుక్రవారం సాయంత్రం తన ఇంటివద్ద ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి స్వామి కిందపడిపోయారు. దీంతో మెడకు గాయమవడంతో స్థానికంగానే చికిత్స చేయించుకున్నారు. తర్వాత పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. అంశాల స్వామి మృతిపట్ల మంత్రి కేటీఆర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ‘ఫ్లోరోసిస్ బాధితుడైన స్వామి ఫ్లోరైడ్‌ సమస్యపై అవిశ్రాంతంగా పోరాడారు. ఆయన ఎంతో మందికి స్ఫూర్తి. ఎప్పటికీ తన మనసులో గుర్తుండిపోతాడు. అతని ఆత్మకు శాంతి చేకూరాలి’ అని ట్వీట్‌ చేశారు.

గతంలో స్వామి కష్టాలను తెలుసుకున్న కేటీఆర్ అతడికి అండగా నిలబడ్డారు. జీవనోపాధి కోసం ఓ సెలూన్ ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ప్రభుత్వం తరఫున డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణం కోసం రూ.5.50 లక్షల మంజూరు చేయించారు. గతేడాది స్వామి ఇంటికి వెళ్ళిన కేటీఆర్ ఆయనతో కలిసి భోజనం చేశారు. స్వయంగా స్వామికి అన్నం వడ్డించి పెట్టారు కేటీఆర్.

ఇవి కూడా చదవండి :

ఎమ్మెల్సీ కవితతో ప్రముఖ నటుడు భేటీ..

ఐసీయూలోనే తారకరత్న..ఎక్మో అమర్చి ట్రీట్మెంట్ ?