నల్గొండలో తొంగితొంగి చూశాడు.. గుద్దిగుద్ది దంచారు..  - MicTv.in - Telugu News
mictv telugu

నల్గొండలో తొంగితొంగి చూశాడు.. గుద్దిగుద్ది దంచారు.. 

August 29, 2019

పసి పాపలనే కాదు పెళ్లికాని అమ్మాయిలు, పెళ్లి అయిన ఇల్లాలు, ముసలివాళ్లు ఇలా ఎవర్నీ వదిలిపెట్టడంలేదు కామాంధులు. ఒళ్లు కొవ్వెక్కి విచ్చలవిడితనానికి తెగబడుతున్నారు. పచ్చని కాపురంలో చిచ్చు రేపాలనుకున్న ఓ ఆకతాయిని పట్టుకుని భార్యాభర్తలు చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. వివాహిత పట్ల వెకిలి చూపులు చూస్తూ..అసభ్యకరంగా సైగలు చేస్తూ వేధిస్తున్న అతన్ని పట్టుకుని చితకబాదారు. ఈ ఘటన నల్గొండ పట్టణంలో చోటు చేసుకుంది. ఆర్జాలబావికి చెందిన శ్రీశైలం అనే యువకుడు అదే కాలనీకి చెందిన వివాహిత పట్ల కొంతకాలంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఆమెకు పెళ్లి అయింది, భర్త వున్నాడన్న ఇంగితం కూడా లేకుండా ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.

దీంతో అతని ఆగడాలను తాళలేక సదరు మహిళ అతని గురించి తన భర్తకు చెప్పింది. భర్తతో కలిసి యువకుడిని పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. స్థానికులు కూడా పోగై అతనికి చివాట్లు పెట్టి చితకబాదారు. సమాచారం అందుకున్న నల్గొండ గ్రామీణ ఠాణా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకుముందు అతను ఆ వీధిలో సంచరిస్తున్న సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించి విచారణ చేపట్టారు.