అమెరికాలో కాల్చివేతకు గురైన నల్గొండ వాసి - Telugu News - Mic tv
mictv telugu

అమెరికాలో కాల్చివేతకు గురైన నల్గొండ వాసి

June 22, 2022

తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాకు చెందిన నక్కా సాయిచరణ్ అనే యువకుడు అమెరికాలోని మేరీలాండ్‌లో నల్లజాతీయులు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు. సాయి చరణ్‌ గత రెండేండ్లుగా మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్‌ నివాసం ఉంటూ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆదివారం ఉదయం తన మిత్రుడిని విమానాశ్రయంలో వదిలిపెట్టి, తిరిగి ఇంటికి వెళ్తుండగా తన కారుపై ఓ నల్లజాతీయులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో సాయి చరణ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు.

అనంతరం విషయం తెలుసుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకొని, సాయి చరణ్ మృతదేహాన్ని కారు నుంచి బయటికి తీశారు. సాయి చరణ్ వివరాలను తెలుసుకొని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కొడుకు మరణవార్తను విన్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.