మైక్రోసాఫ్ట్ ఆఫర్.. నల్గొండ విద్యార్థికి కోటిన్నర జీతం - MicTv.in - Telugu News
mictv telugu

మైక్రోసాఫ్ట్ ఆఫర్.. నల్గొండ విద్యార్థికి కోటిన్నర జీతం

December 4, 2019

Nalgonda 01

ఐటీ రంగాల్లో మన విద్యార్థులు తమ సత్తా చాటుతూనే ఉన్నారు. ఇప్పటికే ప్రపంచ దిగ్గజాల సీఈవోలుగా మనవాళ్లు పనిచేస్తున్నారు. ఎన్నో సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో కీలక పదవుల్లో తెలుగువారు ఉన్నారు. తాజాగా నల్గొండ బీటెక్ విద్యార్థికి మైక్రోసాఫ్ట్‌లో అద్భుతమైన ఆఫర్ వచ్చింది. ప్రతి ఏటా కోటిన్న రూపాయల జీతం అతనికి ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. 

నల్గొండ జిల్లా ధర్మాపురాని చెందిన చింతరెడ్డి సాయిచరిత్‌రెడ్డికి బాంబే ఐఐటీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల జరిగిన క్యాంపస్ సెలక్షన్లలో అతడు మైక్రోసాఫ్ట్ కంపెనీకి ఎంపిక అయ్యాడు. వెంటనే అతనికి ఏడాదికి కోటిన్నర జీతం ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. 

బాంబే ఐఐటీ నుంచి ముగ్గురు అర్హత సాధించగా అందులో సాయిచరిత్‌రెడ్డి ఒకరు కావడం విశేషం. అతడు సాధించిన ఘనతతో తల్లిదండ్రుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన చదువు పూర్తి కాగానే ఉద్యోగంలో చేరనున్నాడు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో మొదట్లోనే ఇంత జీతం లభించడం గొప్పవిషయమని ప్రొఫెసర్లు చెబుతున్నారు.