టీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేతగా నామా.. - MicTv.in - Telugu News
mictv telugu

టీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేతగా నామా..

June 13, 2019

Nama nageshwara rao elected as trs lp leader in lok sabha by kcr

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఈ రోజు ప్రగతి భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది. తెలంగాణ ప్రయోజనాలపై రాజీలేని వైఖరితో సాగాలని నిర్ణయించారు.

సమావేశంలో పార్టీ పార్లమెంటరీ నాయకుడిగా, రాజ్యసభా పక్ష నేతగా కె.కేశవరావును, ఉప నాయకుడిగా బండ ప్రకాశ్‌ను, లోక్‌సభా పక్ష నేతగా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావును, ఉపనేతగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎన్నుకున్నారు. గత లోక్‌సభలో పార్టీ  లోక్‌సభాపక్ష నేతగా జితేందర్‌ రెడ్డి, ఉప నేతగా వినోద్‌ వ్యవహరించారు. జితేందర్ రెడ్డి బీజేపీలో వెళ్లడం, వినోద్ సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. కాగా, లోక్ సభలో విప్‌గా జహీరాబాద్ ఎంపీ బీబీ పటేల్ ఎన్నికయ్యారు. రాజ్యసభలో విప్‌గా జోగినపల్లి సంతోష్ కుమార్ నియమితులయ్యారు. గతంలో నామా టీడీపీ పక్ష నేతగా పనిచేసిన అనుభవం ఉండడంతో ఆయనకు ఈసారీ అదే పదవి ఇచ్చారు.