నమకం - చమకం Dj నుంచి ఔట్ - MicTv.in - Telugu News
mictv telugu

నమకం – చమకం Dj నుంచి ఔట్

June 7, 2017

జగన్నాధం గారు Dj వాయించి శివుడి స్తోత్రం వినబడకుండా తీన్మార్ స్టెప్పులు వేయిద్దామనుకున్నాడేమో.. గోడలకే చెవులుంటున్న ఈ రోజల్లో Dj ఎంత లౌడ్ గా వున్నా లిరిక్ గలత్ అన్పిస్తే ఊరుకుంటారా భక్తులు ? చుప్ చాప్ గా Dj తగ్గించి వేరే పాటకు వెళ్ళిపోవడాన్ని చూసి భక్తుల రూట్లోకే వస్తున్నట్టనిపిస్తోంది. పాత లిరిక్స్ ని తుడిచేసి కొత్త లిరిక్స్ తో సరికొత్తగా రావడానికి ట్రై చేస్తున్నట్టు సమాచారం. రుద్రాభిషేకంలో వచ్చే ‘ నమకం – చమకం ’ అనే స్తోత్రాలు ఒక రొమాంటిక్ సాంగ్ లో రావడం అనేది మింగుడుపడకుండా వుందనేది బ్రహ్మణ సంఘాల వాదన. బుద్ధం శరణం గచ్ఛామి కాదు యుద్ధం శరణం గచ్ఛామి అనే డైలాగ్ కూడా రానున్న రోజుల్లో వివాదంగా మారే ఛాన్సుంది. యుధ్ధానికి ప్రత్యాన్మాయమే బౌద్ధం అన్న విషయం Dj సిన్మా సందర్భంగా మళ్ళొకసారి చర్చలోకొచ్చే ఛాన్స్ వుంది.