కారు నంబర్ ప్లేట్‌పై సీఎం జగన్ పేరు.. కేసు నమోదు.. - MicTv.in - Telugu News
mictv telugu

కారు నంబర్ ప్లేట్‌పై సీఎం జగన్ పేరు.. కేసు నమోదు..

October 22, 2019

Name of CM pics on car number plate .. Case Register .. .

కారుకు ఉన్న నంబర్ ప్లేట్‌పై నంబర్‌కి బదులు ఏపీ ముఖ్యమంత్రి జగన్(AP CM JAGAN) పేరు రాసి వుంది. దీనిని గమనించిన జీడిమెట్ల పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి జరిమానా విధించారు. ట్రాఫిక్ చలానాలు, టోల్ ఫీ వంటి చెకింగ్‌ల నుంచి తప్పించుకోవడానికే తాను ఈ విధంగా చేసినట్టు సదరు యువకుడు పోలీసులకు తెలిపాడు. తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురానికి చెందిన ముప్పిడి హరి రాకేష్ అనే యువకుడు నగరంలోని ఓ కళాశాలలో బిటెక్ చదువుతున్నాడు. తన కారుకు ఇరువైపులా ఏపీ సీఎం జగన్ అని రాసి ఉన్న నంబర్ ప్లేట్‌ను వినియోగిస్తున్నాడు. 

ఆ కారును గుర్తించిన పోలీసులు అతనిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ చలానాలు, టోల్ ఫీ చెకింగ్‌ల నుంచి తప్పించుకోవడానికే తాను ఈ విధంగా జగన్ పేరు రాసకున్నట్టు సదరు యువకుడు పోలీసులకు చెప్పాడు. దీనిపై జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. సొంత వాహనాలపై ముఖ్యమంత్రి పేరు రాసుకుని పోలీసులను తప్పుదోవ పట్టించడం నేరం అని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడినా వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆ కారు(AP 10 BD 7299) తూర్పుగోదావరి జిల్లా, కోటవారి వీధి, పిఠాపురానికి చెందిన యేసురెడ్డి పేరిట రిజిస్టర్ అయిందని తెలిపారు.