ప్రత్యేకహోదా సాధించేవరకు జగన్‌ను పేరు పెట్టే పిలుస్తా.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రత్యేకహోదా సాధించేవరకు జగన్‌ను పేరు పెట్టే పిలుస్తా..

December 1, 2019

ఏపీకి ప్రత్యేక హోదా సాధించేంతవరకూ.. ఆయనను జగన్ రెడ్డి అని పేరు పెట్టే పిలుస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ పర్యటనలో భాగంగా పవన్ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన కొంతమందికే సీఎం అని.. ఏపీకి ప్రత్యేకహోదా సాధించేవరకు ఆయనను పేరు పెట్టే పిలుస్తానని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. 

రైల్వే కోడూరు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘వైసీపీ నేతలు పూర్తిగా ప్రత్యేక హోదా విషయం మర్చిపోయారు. మాయమాటలు చెప్పి అధికారాన్ని సంపాదించారు. హోదా గురించి మోదీ దగ్గర అడిగే ధైర్యం వైసీపీకి లేదు.  ఆశయం కోసం పని చేసేవారికి గెలుపు ఓటములతో సంబంధం లేదు. అందుకే మేము ఓడిపోయినా.. ప్రజలు ఇప్పటికీ మమ్మల్ని ఆదరిస్తున్నారు. జగన్‌కు భారతి సిమెంట్‌ పరిశ్రమపై ఉన్న శ్రద్ధ.. కడప ఉక్కు పరిశ్రమపై ఎందుకు లేదు. రాయలసీమ ఫ్యాక్షన్ గడ్డ కాదు.. ఈ గడ్డ చదువుల తల్లి. వైఎస్ జగన్ రెడ్డి సీఎంలా మాట్లాడితే.. నేను కూడా ఆయనికి మార్యాద ఇచ్చి మాట్లాడతా. జగన్ కొంతమందికే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారు.  అందుకే ఆయనను పేరు పెట్టి పిలుస్తున్నా’ అని పవన్ మండిపడ్డారు.