తిరుపతిలో ఘనంగా నమిత పెళ్లి - MicTv.in - Telugu News
mictv telugu

తిరుపతిలో ఘనంగా నమిత పెళ్లి

November 24, 2017

సీనియర్ నటుడు శరత్ బాబును పెళ్లాడబోతున్నట్లు వచ్చిన వార్తలకు చెక్ పెడుతూ.. నటుడు వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన బొద్దునటి నమిత త్వరగానే  పెళ్లిపీటలెక్కేసింది. తిరుపతి పుణ్యక్షేత్రంలో శుక్రవారం పొద్దున వీరి పెళ్లి వేదమంత్రాల మధ్య ఘనంగా జరిగింది. తెలుగు, తమిళ చిత్ర ప్రముఖులు, బంధుమిత్రులు హాజరయ్యారు. అంతకు ముందు చెన్నైలో సంగీత్ వేడుక కూడా ఘనంగా జరిగింది.వీరూ, నమిత ‘మియా’లో నటించారు. మొదట వీరూనే ప్రపోజ్ చేశాడని, తాను కాదనలేకపోయానని ఆమె తెలిపింది.
2001లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని వెలుగులోకి వచ్చింది నమిత. తర్వాత ‘సొంతం’ తెలుగు సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. దక్షిణాదిలో చాలామంది అగ్రనటుల సరసన నటించింది. కెరీర్లో పెద్ద హిట్ సినిమాలేవీ లేకపోయినా పదిహేనేళ్లులుగా ఇండస్ర్టీలో నెగ్గుకొస్తూనే ఉంది. వయసు కాస్త పైబడ్డంతో హీరోయిన్ అవకాశాలు తగ్గడంత్ ఒకింటిదైపోయింది.