జగన్‌కు నాంపల్లి కోర్ట్ సమన్లు.. హాజరు కావాలని ఆదేశం - MicTv.in - Telugu News
mictv telugu

జగన్‌కు నాంపల్లి కోర్ట్ సమన్లు.. హాజరు కావాలని ఆదేశం

March 24, 2022

06

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు ఈనెల 28వ (సోమవారం) తేదీన హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. 2014లో తెలంగాణలోని హుజూర్‌నగర్‌ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే అభియోగంపై కోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గురువారం న్యాయస్థానం మరోసారి జగన్‌కు సమన్లు జారీ చేసింది.

2014 సార్వత్రిక ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి వైసీపీ తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టింది. అయితే, ఎన్నికల నియమావళిని పాటించలేదు. అంతేకాకుండా కాంపిటెంట్ అథారిటీ అనుమతి లేకుండానే రోడ్ షో నిర్వహించింది. దీంతో అప్పటి ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీసులు జగన్‌తో పాటు, ఆ పార్టీ సభ్యులైన జి నాగిరెడ్డి, జి శ్రీకాంత్‌పై కేసులు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్-188,143 కింద అప్పట్లోనే పోలీసులు సమన్లు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో పదవిలో ఉన్న సీఎంను కోర్టుకు హాజరుకావాలని ఆదేశించటం సంచలనంగా మారింది.