నమ్రతకు బాగా పొగరు.. మలైకా అరోరా - MicTv.in - Telugu News
mictv telugu

నమ్రతకు బాగా పొగరు.. మలైకా అరోరా

February 23, 2018

టాలీవుడ్ చాక్లెట్ బాయ్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్‌పై బాలీవుడ్ సెక్స్ బాంబ్ మలైకా అరోరా సంచలన ఆరోపణలు చేసింది. నమ్రతకు బాగా పొగరు అని, తనతో దురుసుగా ప్రవర్తించేందని మండిపడింది. అయినా తాను అన్నీ ఓర్చకుని, వారితో స్నేహం కొనసాగిస్తున్నానని తెలిపింది.‘నేను మోడలింగ్ రంగంలోకి వచ్చేనాటికే  నమ్రత సీనియర్ మోడల్. ఈ కారణంతో ఆమెను గౌరవించేదాన్ని. నమ్రతతోపాటు మరో మోడల్ మెహర్ జెస్సియా కూడా టాప్ లెవల్లో ఉండేది. అందుకే వారు పొగరుతో ఉంటేవారు. సీనియర్లమని మాలాంటి జూనియర్లను కించపరచేవారు.  నన్ను దూషించేవారు…’ అని బాలీవుడ్ నటి నేహా ధూపియా నిర్వహిస్తున్న ‘వోగ్ బీఎఫ్ఎఫ్’ కార్యక్రమంలో వెళ్లబోసుకుంది మలైకా. మోడలింగ్ రంగంలో తనకు ఇలాంటి ఎన్నో చేదు అనుభవాలు ఉన్నాయని, అయినా వాటిని మరచిపోయి ప్రస్తుతం నమ్రత, నేహాలతో స్నేహంగానే ఉంటున్నానని తెలిపింది.