డ్రగ్స్ కేసులో మహేశ్ భార్య పేరు.. ఎన్ అంటే నమ్రతే!  - MicTv.in - Telugu News
mictv telugu

డ్రగ్స్ కేసులో మహేశ్ భార్య పేరు.. ఎన్ అంటే నమ్రతే! 

September 22, 2020

 Namrata Shirodkar is 'N' in drug chats with Jaya Saha claims reports.

సినీ నటులు డ్రగ్స్ వాడడం కొత్తేమీ కాకపోయినా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో ఈ వ్యవహారం ప్రముఖంగా వెలుగులోకి వచ్చింది. అతనికి ప్రియురాలు రియా చక్రవర్తి డ్రగ్స్ అలవాటు చేసిందనే ఆరోపణల నేపథ్యంలో టాలీవుడ్, శాండల్‌వుడ్‌లలో మత్తుమనుషుల పేర్లు కూడా బయటికొస్తున్నాయి. టాప్ హీరో మహేశ్ బాబు భార్య, మాజీ నటి నమ్రతా శిరోద్కర్ కూడా ఈ రాకెట్లో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె సుశాంత్ మాజీ టాలెంట్ మేనేజర్‌తో చేసిన చాటింగ్ వివరాలు కలకలం రేపుతున్నాయి. 

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ కేసులో ఇప్పటికే చిక్కుకోవడం తెలిసిందే. నమ్రతకు కూడా డ్రగ్స్‌తో సంబంధముందని చెప్పే చాట్స్ వివరాలను జాతీయ మీడియా సంస్థ ఆజ్ తక్ బయటపెట్టంది. ముంబైకి చెందిన డ్రగ్స్ సరఫరాదారు  జయా షాతో నమ్రత చాట్ చేశారు. ‘ముంబైకి వస్తే MD ఇప్పిస్తానని చెప్పావు. మనం పార్టీ చేసుకుందాం.. ’ అని నమ్రత అన్నట్లు అందులో ఉందట. దీనికి జయా బదులిస్తూ.. ‘నవ్వు నన్ను డ్రగ్స్ సప్లయిగా మార్చావు కదా, నీ మాట తప్పకుండా పాటిస్తా..’ అని చెప్పిందట. జయా షా చాట్స్ సంభాషణల్లోని ఎన్‌సీబీ అంటే మరెవరోకాదు, 90లనాటి బాలీవుడ్ నటి, ఆమె ఇప్పుడు సౌతిండియా సూపర్ స్టార్ మహేశ్ బాబు భార్య’ అని ఆజ్ తక్ పేర్కొంది. మా రాకెట్‌కు సంబంధిన పేర్లలో దీపికా పడుకోన్, కరిష్మా కపూర్, శ్రద్ధా కపూర్ తదితరుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మహేశ్ బాబు భార్య పేరు బయటికి రావడంతో అతని అభిమానులు హైరానా పడుతున్నారు.