namratha reveals dating secrets with her husband mahesh babu
mictv telugu

మహేష్ తో డేటింగ్.. హాట్ క్వశన్స్ కి నమ్రత కూల్ ఆన్సర్స్

December 22, 2022

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బెటర్ హాఫ్‌ ఘట్టమనేని నమ్రత శిరోద్కర్.. ఇటీవల ఒక యూట్యూబ్‌ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఇంకా చర్చనీయాంశం అవుతూనే ఉంది . ముఖ్యంగా మహేష్ బాబు వ్యక్తిగత అంశాలు, వారి డేటింగ్ సీక్రెట్స్ పై నమ్రత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పెళ్ళికి ముందు డేటింగ్ ఖబుర్లు, తన వైవాహిక జీవితం, ఫస్ట్ మీట్, లవ్ స్టోరీ ఇలా అన్ని అంశాలపై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు నమ్రత శిరోద్కర్. నమ్రతకు కూడా సినిమా నేపథ్యం ఉంది. ఆమె అమ్మమ్మ దివంగత మీనాక్షి శిరోద్కర్ ప్రముఖ మరాఠీ నటి. ఆమె మరాఠీ చిత్రాలలో మొదటిసారి స్విమ్ సూట్ ధరించారు. అమ్మమ్మ అడుగుజాడల్లో ఆమె సోదరి శిల్పా శిరోద్కర్ బాలీవుడ్‌లో చేరి 1990లో హీరోయిన్‌గా ఎదిగారు.

శిల్పా తరువాత మోడలింగ్ నుండి నటి అయ్యారు నమ్రత. వంశీ సినిమాతో మహేష్ బాబుతో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారి పెళ్లివరకు వెళ్లిందని పేర్కొంది నమ్రత. ఇక డేటింగ్ సమయంలోనే మహేష్‌ బాబుతో ఎక్కువగా సినిమా షూటింగ్‌లకు వెళ్లేదని, షూటింగ్ పూర్తయ్యాక.. మహేష్‌ బాబుతో చిల్ అయ్యే దాన్ని అంటూ, మహేష్‌ బాబు ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ అంతా కూడా కలిసి చిల్ అయ్యే వాళ్లమని నమ్రత చెప్పుకొచ్చింది. మహేష్‌ బాబు ఎప్పుడూ కూడా తనను బోర్ ఫీల్ అయ్యేలా చేయలేదని, ఒంటరిదాన్ని అనే ఫీలింగ్ రానిచ్చే వాడు కాదని చెప్పుకొచ్చాడు. ఇక పెళ్లి తర్వాత తాను సినిమాల్లో కొనసాగడం తనకు ఇష్టం లేదని మహేష్ బాబు స్పష్టం ముందే చెప్పినట్టు నమ్రత చెప్పింది.

ఇవి కూడా చదవండి :

మెగాస్టార్ కి మోసం.. పదేళ్లకు నోరు విప్పిన నయనతార..!

పెను దుమారంగా ప్రభాస్ విగ్గు .. బన్నీ డార్లింగ్ ఫ్యాన్స్ మధ్య తీవ్ర ఘర్షణ