Namratha Shirodkar Shares Mahesh Babu New Look For SSMB28
mictv telugu

ఇన్‌స్టాలో మహేశ్ స్టైలిష్ లుక్ పోస్ట్ చేసిన నమ్రత

September 12, 2022

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా కోసం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించనున్న ఈ సినిమా ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ 28 అనే వర్కింగ్‏ టైటిల్‏తో రూపొందుతుంది. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమాలు చాలా రోజుల క్రితమే జరగ్గా.. ఇప్పటివరకు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంది. ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుంతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ముందు నుంచి చెబుతున్నట్లుగానే ఈ ప్రాజెక్ట్ సెప్టెంబర్ రెండోవారంలోనే అంటే ఈ వారంలోనే స్టార్ట్ కాబోతుందని వార్తలు వినిపించాయి. తాజాగా సూపర్ స్టార్ అభిమానులకు మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. ఎస్ఎస్ఎంబీ 28 సెట్ నుంచి మహేష్ ఫోటో షేర్ చేశారు.

కొంచెం గెడ్డం పెంచి, చెదిరిన జుట్టుతో చాలా స్టైల్‌గా కనిపించాడు మహేశ్. స్టైలిష్ ఆలిమ్ హకీమ్ మన సూపర్‌స్టార్‌ని ఇలా స్టైలిష్‌గా తయారు చేశాడు. ఈ ఫోటో పెట్టి ‘వర్క్ మోడ్ ఆన్’ అని నమ్రతా క్యాప్షన్ పెట్టి, సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యిందని క్లారిటీ ఇచ్చింది. కాగా.. పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్టు ఇదివరకే చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అతడు, ఖలేజా తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న మూడో సినిమా కావడంతో.. ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమాను హారికా & హాసినీ, సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రంలో.. కీలక పాత్రల కోసం కొందరు ప్రధాన నటీనటుల్ని రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది.