Nandamuri balakrishna fires on ycp government over name changing of ntr health university
mictv telugu

పంచ భూతాలున్నాయ్.. త‌స్మాత్ జాగ్ర‌త్త.. బాలయ్య వార్నింగ్

September 24, 2022

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారం ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హెల్త్‌ యూనివర్సిటీ పేరు మారుస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేతలు నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ సర్కార్ తీసుకున్ని నిర్ణయంపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ట్వీట్ చేశారు. మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి NTR అన్నది పేరుకాదని.. ఓ సంస్కృతి, ఓ నాగరికత, తెలుగుజాతి వెన్నెముక అన్నారు. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చారని.. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నారని.. ‘మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు’ అంటూ ట్వీట్ చేశారు.

పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త అంటూ బాలయ్య హెచ్చరించారు. అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు. పీతలున్నారు.. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్ అన్నారు. శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు అంటూ ఘాటుగా స్పందించారు బాలయ్య.