నందమూరి, అక్కినేని, కొణిదెల, మంచు.. నానా కుటుంబాల వార్తలతో తెలుగు మీడియా హోరెత్తిపోతుండడం మామూలే. సెలంబ్రిటీలు కనుక జనానికి ఆసక్తీ సహజమే. అయితే ఎప్పుడూ.. ఆయన సినిమా ప్రారంభం, ఆమె విదేశాలకు వెళ్లింది, అతడు ఆమెతో, ఈమె అతనితో తిరుగుతున్నారు వంటి వార్తలేనా అంటూ కొన్నిసార్లు వెరైటీ వెరైటీ విషయాలు కూడా బయటికి వస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. జూనియర్ ఎన్టీఆర్‌కు నందమూరి తారకరత్నపెద్దకర్మ కార్యక్రమంలో ఘోర అవమానం జరిగిందని చెప్పుకుంటూ ఈ వీడియోను కొందరు అభిమానులు వైరల్ చేస్తున్నారు.
Brother's @tarak9999 & @NANDAMURIKALYAN Respect Towards Elders ❤️❤️. pic.twitter.com/jGfONERyfD
— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) March 2, 2023
తారకరత్న గుండెపోటుతో కన్నుమూయడం తెలిసిందే. బతికించడానికి ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. నందమూరి బాలకృష్ణ ఆస్పత్రిలోనే కాకుండా, అంత్యక్రియలను కూడా దగ్గరుండి జరిపించాడు. అపరకర్మలను కూడా తనే నిర్వహిస్తున్నాడు. గురువారం పెద్దకర్మ ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్లో జరిగింది. నందమూరి కుటుంబాల నుంచి వృద్ధులు, మధ్యవయస్కులు, కుర్రాళ్లు అందరూ వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కూడా హాజరయ్యారు. బాలయ్య అందర్నీ పలకరించారు. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌ల దగ్గరికి రాగానే వారిద్దరూ లేచి నిలబడ్డారు. అయితే బాలయ్య వారివైపు పెద్దగా చూడలేదు. ఏదో చేతులూపి వేరేవాళ్లను పలకరించేపనిలో పడ్డాడు. అయితే ఆయన తమ హీరోను అసలు పట్టించుకోలేదని, ఇది అవమానించడమేనని తారక్ అభిమానులు వాపోతున్నారు. తారక్‌ను నందమూరి ఫ్యామిలీ తొలినుంచీ దూరం పెడుతూనే ఉందని, ఈ కార్యక్రమంలో తారక్ ముఖం చిన్నబోయిందని గుర్తుచేస్తున్నారు. అయితే అది శుభకార్యం కాదని, కర్మకాండలో నవ్వుతూ పలకరించుకుంటారా అని మరికొందరు అంటున్నారు. అది విషాద కార్యక్రమం కాబట్టే తారక్ అలా ముఖంపెట్టాడని అంటున్నారు.