ఎన్టీఆర్‌ శత జయంతి.. నిమ్మకూరులో బాలకృష్ణ సందడి - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్టీఆర్‌ శత జయంతి.. నిమ్మకూరులో బాలకృష్ణ సందడి

May 28, 2022

ఎన్టీఆర్ శత జయంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నందమూరి తారక రామారావు స్వస్థలం కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎన్టీఆర్‌ విగ్రహానికి ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నిమ్మకూరు వచ్చిన ఆయన.. వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్‌ చిరస్థాయిలో నిలిచిపోయారని పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టేలా నేనున్నానని ముందుకొచ్చారని, రెండు రూపాయలకు కిలో బియ్యం, పేదలకు ఇళ్లు ఇచ్చారని తెలిపారు. నిమ్మకూరును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. నిమ్మకూరు చెరువు వద్ద 35 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు అంతా తీర్మానించామని చెప్పారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలన్నారు. ఎన్టీఆర్‌ ఆశీస్సులు తెలుగు రాష్ట్రాలపై ఉంటాయన్నారు. మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగా పుట్టాలని నినదించిన ఆయనకు వందనాలంటూ పేర్కొన్నారు. కాగా బాలకృష్ణ నేతృత్వంలోనే ఎన్టీఆర్‌ జిల్లా నిమ్మకూరులో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి