టాలీవుడ్ సీనియర్ కథానాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. తనయుడు మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలను బాలకృష్ణ తన నివాసంలో జరిపారు. కుమారుడికి కేక్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు, ఆశీస్సులు అందజేశారు. ఇదే సందర్భంగా ఎన్.టి.ఆర్. జూనియర్ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, గతంలో ఓ ఫంక్షన్లో కలిసిన ఫొటోను పెట్టి అలరించాడు. అటు, మోక్షజ్ఞకు నందమూరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
కాగా ఈ ఏడాదైనా మోక్షజ్ఞ పుట్టిన రోజున సినీ ఎంట్రీకి సంబంధించిన ప్రకటన ఏదైనా వస్తుందని ఆశించిన అభిమానులు నిరాశకు గురవుతున్నారు. 2023లో అయినా హీరోగా ఎంట్రీ ఇస్తాడేమో అని ఎదురుచూస్తున్నారు. కొడుకు మోక్షజ్ఞ పై బాలయ్య ఫోకస్ పెట్టట్లేదేమో అంటూ నందమూరి అభిమానులు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో అయినా మోక్షజ్ఞని సినిమాల్లో నటింప చేయాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు.