Nandamuri Kalyan Ram historical movie 'Bimbisara' trailer release
mictv telugu

కల్యాణ్‌రామ్ హిస్టారికల్ మూవీ ‘బింబిసార’ ట్రైలర్ రిలీజ్

July 4, 2022

Nandamuri  Kalyan Ram historical movie 'Bimbisara' trailer release

నందమూరి హీరో కల్యాణ్‌రామ్‌ పిరియాడికల్ డ్రామాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. తన కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న చిత్రం ‘బింబిసార’ తో తానేంటో నిరూపించుకోవాలనుకుంటున్నాడు. వశిష్ట దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను కల్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మిస్తున్నాడు. ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ విడుదల చేసింది. ట్రైలర్ ఆద్యంతం ఒళ్ళు గగ్గుర్లు పొడిచేలా ఉంది. కళ్యాణ్ రామ్ మేకోవర్ , డైలాగ్ డెలివరీ, విజువల్స్, గ్రాఫిక్స్ సూపర్బ్ గా వర్కౌట్ అయినట్టు కనిపిస్తున్నాయి.

త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడిగా కల్యాణ్‌రామ్‌ చేసిన యుద్ధ విన్యాసాలు, పవర్‌ఫుల్‌ సంభాషణలు, విజువల్స్‌తో ఈ ట్రైలర్.. ప్రేక్షకుల్ని చరిత్రలోకి తీసుకెళ్లేలా చేస్తోంది. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ హిట్టు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. చిరంతన్ భట్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించనున్నారు. ప్ర‌ముఖ సీనియ‌ర్‌ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి నేప‌థ్య సంగీతాన్ని అందిస్తున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై హరికృష్ణ.కె నిర్మిస్తున్న ఈ ఫాంటసీ యాక్షన్‌ చిత్రంలో కేథరిన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.