Nandamuri Lakshmi Parvathi wants Junior NTR to enter politics
mictv telugu

జూ. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి.. లక్ష్మీ పార్వతి

August 24, 2022

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరారు నందమూరి లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి తెలుగు దేశం పార్టీని స్వాధీనం చేసుకోవాలని, అదే తన కోరిక అని చెప్పారు. తెలుగు, సంస్కృతి అకాడమీ అధ్యక్షురాలైన లక్ష్మీ పార్వతి తిరుపతిలో స్వర్గీయ గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు లక్ష్మీపార్వతి తెలిపారు. ఈనెల 25న తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ వేదికగా గిడుగు బాషా ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు.

ఈ సందర్భంగా తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కావడంపై ఆమె స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలన్నారు. చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరించి మహానేత ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్నారని ఆమె ఆరోపించారు. చం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి తెలుగు దేశం పార్టీని స్వాధీనం చేసుకోవాలని లక్ష్మీపార్వతి అన్నారు.