టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న శివైక్యం చెందారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభం సందర్భంగా పాల్గొన్న తారకరత్న తీవ్రమైన గుండెనొప్పి రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కుప్పంలో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించి తర్వాత మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించారు. అయినా ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో విదేశాల నుంచి వైద్య నిపుణులను రప్పించి చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. శివరాత్రి రోజే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన తారకరత్న మరణం సినీలోకాన్ని విషాదానికి గురి చేసింది. నందమూరి అభిమానులు పలువురు ఆ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
తారకరత్న గురించి సంక్షిప్తంగా
ఫిబ్రవరి 22, 1983 హైదరాబాదులో జన్మించారు. ఇతని తండ్రి నందమూరి మోహన కృష్ణ సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. తల్లి నందమూరి శాంతి మోహన్. 2012లో నందీశ్వరుడు సినిమాకు క్యాస్టూమ్ డిజైనర్‌గా పనిచేసిన అలేఖ్య రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. దీన్ని ఇంట్లో వాళ్లు వ్యతిరేకించారు. ఎందుకంటే అలేఖ్యరెడ్డికి అంతకుముందే పెళ్లయి విడాకులు తీసుకున్నందున వ్యతిరేకించడంతో అప్పటినుంచి తారకరత్న పేరెంట్స్ నుంచి విడిగా ఉంటూ వస్తున్నారు. ఈ దంపతులకు 2013లో కూతురు పుట్టింది. 2001లో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఒకేసారి 9 సినిమాలను ప్రారంభించి ప్రపంచరికార్డు సృష్టించాడు. 2016లో 1.50 కోట్ల కారు కొనుక్కొని నర్సరావుపేటలో 6 లక్షలు పెట్టి 9999 ఫ్యాన్సీ నెంబర్ దక్కించుకున్నారు. 2002లో ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. 2009లో అమరావతి చిత్రంలో ప్రతినాయకుడి పాత్రకు గాను ఉత్తమ ప్రతినాయకుడుగా నంది అవార్డు అందుకున్నారు. నందమూరి మనవడైన తారకరత్న ఒక్కడే సంతానం.!