సర్వే చేయించి ఇచ్చేవాళ్లం... - MicTv.in - Telugu News
mictv telugu

సర్వే చేయించి ఇచ్చేవాళ్లం…

November 20, 2017

ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై వస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు స్పందించారు..  ‘అవార్డులకు కమ్మకులం రంగు పులమడం దారుణం. అన్నీ మావాళ్లకే ఇచ్చారనడం విడ్డూరం..  ఇలాంటి విమర్శలు వస్తాయని ముందే తెలిసి ఉంటే.. ప్రజాభిప్రాయం ఏమిటో తెలుసుకోవడానికి సర్వే చేసి.. ఆ ఫలితాల ప్రకారం అవార్డులు ప్రకటించి ఉండేవాళ్లం’ అని ఆయన అన్నట్లు తెలుస్తోంది.

ఆయన ఈ వివాదంపై సోమవారం అమరావతిలో మంత్రులతో ముచ్చటించారు. ఈ అవార్డుల విషయంలో ఇంత రచ్చ చేస్తారని అనుకోలేదని, విమర్శించేవారు ఏపీతో పెద్దగా అనుబంధమున్న వారు కారని ఆయన అన్నట్లు సమాచారం. ‘ఎన్నో దశాబ్దాల నుంచి వస్తున్న సంప్ర‌దాయం ప్ర‌కార‌మే జ్యూరీ స‌భ్యుల‌ను నియ‌మించి అవార్డు విజేతల‌ను ఎంపిక చేశాం. ఇలా అర్థంపర్థం లేని విమర్శలు చేస్తున్నందుకు బాధగా ఉంది’ అని బాబు బాధపడుతున్నట్లు ఆయన కొడుకు, ఏపీ మంత్రి లోకేశ్ కూడా చెప్పాడు.