లోకేశ్.. నందులను ఆధార్ కార్డులకు ఇవ్వరు! - MicTv.in - Telugu News
mictv telugu

లోకేశ్.. నందులను ఆధార్ కార్డులకు ఇవ్వరు!

November 22, 2017

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల వివాదం ముదురుతోంది. ఏపీలో ఆధార్ కార్డులేని వాళ్లు విమర్శలు చేస్తున్నారని మంత్రి నారా లోకేశ్ అనడంపై పోసాని కృష్ణమురళి మండిపడ్డం తెలిసిందే. తాజాగా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా లోకేశ్ పై ఆగ్రహం వెళ్లగక్కారు.ఇది అవార్డుల విషయమని, ఆధార్ కార్డుల గొడవ కాదని అన్నారు. ‘ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నాడు లోకేశ్. అతడు ముఖ్యమంత్రి కొడుకు. ఇలాంటి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయడం బాధ కలిగించింది. లోకేశ్  ఏదైనా మాట్లాడేముందు తన తండ్రి పరువు గురించి ఆలోచించాలి’ అని హితవు పలికారు.

‘మొన్నటి దాకా మీకు ఆధార్ కార్డులు ఎక్కడున్నాయి? రాష్ట్రం విడిపోయినా మీరు ఇప్పటికీ హైదరాబాదులోనే ఉంటున్నారు కదా.  మీకు మాట్లాడే అర్హత ఉందా? అని మేం అడిగితే బాగుండదు..చాలా అసహ్యంగా ఉంటుంది’ అని అన్నారు. నంది అవార్డులు సినిమా వాళ్లకు ఇస్తారని, ఆధార్ కార్డులకు ఇవ్వరని ఎద్దేవా చేశారు. ‘ అవగాహన లేకుండామాట్లాడి నీ పరువు, నీ తండ్రి పరువు, ఏపీ పరువు తీయకు’ అని అన్నారు.