తెలంగాణ ‘సింహ’ అవార్డులెప్పుడు? - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ ‘సింహ’ అవార్డులెప్పుడు?

November 22, 2017

ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై వివాదం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమకు ఎప్పుడు అవార్డులిస్తుందన్న చర్చ మళ్లీ మొదలైంది. రాష్ట్రం ఏర్పడి మూడున్నరేళ్లు అవుతున్నా ఇంతవరకూ అవార్డులు ఇవ్వలేదు. తెలంగాణ కూడా నంది అవార్డుల మాదిరి పురస్కారాలు ఇస్తే తెలంగాణలో సినీపరిశ్రమకు ఊతం లభిస్తుందని ఫిలిం నగర్ వర్గాలు  అంటున్నాయి.

ఏపీ ప్రభుత్వం మూడేళ్లుగా నందులను ప్రకటించకపోవడతో తెలంగాణ సర్కారులోనూ పెద్దగా కదలిక రాలేదు. దసరాకే ఇవ్వాలనుకున్నా అనివార్య కారణాల వల్ల సాధ్యం కాలేదు. నందులపై రచ్చవల్ల వీటి ఆవశ్యకత మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలుగు సినీ పరిశ్రమ అంతా హైదరాబాద్‌లోనే ఉన్న నేపథ్యంలో అవార్డులకు ప్రాధాన్యం పెరిగింది.

నిజానికి దీనిపై తెలంగాణ సర్కారు చాలా కసరత్తే జరింగింది. అయితే ఏ పేరుతో ఇవ్వాలలో సిఫార్సు చేయాలంటూ ప్రభుత్వ సలహాదారు రమణాచారి నేతృత్వంలో కమిటీని కూడా వేశారు. కమిటీ మూడుసార్లు సమావేశమైంది. నెమలి, సింహ, పాలపిట్ల పేర్లు చర్చకు వచ్చాయి. వీటిపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోవాలి. ఆయన చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని కమిటీ చెబుతోంది. ఈ పేర్లలో సింహ పేరుపై సీఎం మొగ్గుచూపిట్లు తెలుస్తోంది.