నల్లవారిపై వివక్ష, అలాంటి పాత్రలే.. నందితా దాస్  - MicTv.in - Telugu News
mictv telugu

నల్లవారిపై వివక్ష, అలాంటి పాత్రలే.. నందితా దాస్ 

September 14, 2019

Nandita Das Women are constantly.

చేసినవి తక్కువ సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్న నటి నందితాదాస్. ఆమె నటించిన పాత్రలు చాలా బాగుంటాయి అని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సినీ పరిశ్రమలో శరీర రంగును ఆధారంగా చేసుకుని నటీనటుల మధ్య వ్యత్సాసం చూస్తారని నందిత వ్యాఖ్యానించింది. ‘డార్క్‌ ఈజ్‌ బ్యూటీఫుల్‌’ అనే క్యాంపెయిన్‌తో కలిసి నందితా పనిచేస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడింది. భారతదేశంలో 90 శాంతి మంది మనుషులు నలుపు రంగులో ఉన్నారని.. వారందరూ ఏదో ఒక సమయంలో వివక్షకు గురి అవుతున్నారని అంది. 

శరీర రంగు విషయంలో భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రాన్ని ఎక్కువగా ఆచరించాల్సిన అవసరం ఉందని చెప్పింది. మా తల్లిదండ్రులు శరీర రంగు విషయంలో ఎలాంటి వివక్ష చూపించలేదని.. కానీ సినీ పరిశ్రమలో అలాంటి వివక్షను ఎదుర్కొన్నానని గుర్తుచేసుకుంది. ‘సమాజంలో ప్రతి ఒక్కరూ వివక్షను ఎదుర్కొంటారు. కానీ సినీ పరిశ్రమలో మాత్రం నల్లగా ఉన్న ప్రతి ఒక్కరూ వివక్షను ఎదుర్కోక తప్పదు. మురికివాడ, గ్రామీణ నేపథ్యాలలో సాగే కథలతోపాటు మలయాళీ, బెంగాలీ చిత్రాలకు అయితే నల్లగా ఉన్నవారిని తీసుకుంటారు. చదువుకున్న అమ్మాయి పాత్రలకు వచ్చేసరికి తెల్లగా, అందంగా ఉండేవారు కావాలంటారు. మన శరీర రంగును ఆధారంగా చేసుకుని మనల్ని మనం నిర్వచించుకోకూడదు. రంగును మించి మనలో ఇంకా చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి. వాటిని మనం బయట ప్రపంచానికి చూపించాలి’ అని నందిత తెలిపింది.